మూత్రంతో కళ్లు శుభ్రం చేసుకున్న మహిళ..వీడియో వైరల్.. నెట్టింట తీవ్రవిమర్శలు

మూత్రంతో కళ్లు శుభ్రం చేసుకున్న మహిళ..వీడియో వైరల్.. నెట్టింట తీవ్రవిమర్శలు

ఓ మహిళ తన కళ్లలోని ఎరుపు రంగు చికాకును తగ్గించుకోవడానికి మూత్రాన్ని వాషింగ్‌గా ఉపయోగిస్తోంది.  ఇది నాచురల్ రెమిడీ అని చెబుతోంది. నేను రోజూ మూత్రంతో కళ్లు కడుక్కుంటున్నాను..మీరు కడుక్కోండి అన్నట్లుగా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో నాచురల్ రెమిడీస్.. ఆరోగ్య ధోరణులపై చర్చకు దారితీసింది. కొందరు ఆమె వ్యక్తిగత ఎంపికను సమర్థించుకుంటుండగా మరికొందరు అంత మంచిదికాదు అంటున్నారు. వివరాల్లోకి వెళదాం.. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nupur Pittie (@nupurpittie)

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పూణెకు చెందిన మహిళ పిట్టి తన సొంత మూత్రాన్ని కళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తున్నట్లు చూపిస్తుంది. ఇది కళ్లు ఎరుపెక్కినా, ఇర్రిటేషన్ ఉన్నా.. ఇది నాచురల్ రెమిడీ.. సహజ నివారణ పద్దతి అని రాసింది. ఈ వీడియోలో తనను తాను ఎటువంటి ఔషధాలు లేకుండా  సహజ వైద్యం ద్వారా అనారోగ్య సమస్యలను పరిష్కరించే ట్రైనర్ గా పరిచయం చేసుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో "యూరిన్ ఐ వాష్- నేచర్స్ ఓన్ మెడిసిన్" అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేసింది. 

ఈ వీడియోలో పొద్దున్నే లేవగానే మూత్రాన్ని పట్టుకొని కళ్లను శుభ్రం చేసుకోవడం ఎలాగో వివరిస్తుంది. ఆమె ఈ పద్ధతిని మందులు లేని జీవనశైలిలో భాగం అంటోంది. ఇది ఎరుపు, పొడి ,ఎలర్జీ కళ్ల నివారణకు సహాయపడుతుందని చెబుతోంది. ఈ పద్ధతి ఆశ్చర్యకరంగా అనిపించినా మూత్రాన్ని ఔషధంగా వాడటం అనేది చరిత్రలో కొన్ని సంస్కృతులలో అక్కడక్కడా కనిపించింది. 

అయితే ఆధునిక వైద్య శాస్త్రం కంటి సమస్యలకు మూత్రాన్ని వాడటాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మూత్రంలో బ్యాక్టీరియా, వ్యర్థ పదార్థాలు ఉంటాయి. వీటిని కళ్ళకు వాడితే, కంటికి ఇన్ఫెక్షన్లు సోకి, సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది శాశ్వత కంటి నష్టం లేదా అంధత్వానికి కూడా దారితీయవచ్చంటున్నారు డాక్టర్లు. 

►ALSO READ | కౌన్సెలింగ్ : పిల్లల ఆన్లైన్ స్నేహాలతో తల్లిదండ్రులు జాగ్రత్త.. ఇవి పాటించండి..!

ఆ వీడియో త్వరగా వైరల్ అయ్యింది.ఆన్‌లైన్‌లో నెటిజన్లనుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కంటిసమస్యలు ఉంటే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.. నిపుణుల సలహా మేరకు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మీ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ కళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు. 

ఈ పద్ధతికి సంబంధించి వైద్య నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుండగా మరికొందరు ఆయుర్వేదంలో దీనికి కొంత ప్రస్తావన ఉందని చెబుతున్నారు. కళ్ళ వంటి సున్నితమైన భాగాలకు ఇలాంటి పద్ధతులు పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం అత్యవసరం అంటున్నారు.