Pushpa 2 Second Song: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నాసామి.. పుష్ప 2 సెకండ్ సాంగ్

Pushpa 2 Second Song: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నాసామి.. పుష్ప 2 సెకండ్ సాంగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2(Pushpa 2). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపధ్యంలో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఆ అంచనాలను మించి టీజర్, సాంగ్స్ ఉండటంతో పుష్ప పార్ట్ 2పై హైప్ రోజురోజుకి డబుల్ అవుతోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం ఉన్నాకూడా అప్పుడే ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టేశారు మేకర్స్. ఈ మధ్యే పుష్ప 2 నుండి మొదటి సాంగ్ విడుదల చేసిన టీమ్.. ఇప్పుడు రెండో సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ పాటకు సంబందించిన ప్రోమో విడుదల చేస్తూ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఈ ప్రోమోలో మేకప్ అవుతున్న శ్రీవల్లిని కేశవ.. పుష్ప 2 నుండి రెండో పాట రిలీజ్ చేస్తన్నారంట కదా. అపాటేందో కొంచం చెప్తావా అని అనగా.. దానికి శ్రీవల్లి.. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నాసామి.. అంటూ పాడి వినిపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సూసేకి  పాట ఫుల్ సాంగ్ మే 29న విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.