Ilayaraja: ఇదే పని పెట్టుకున్నావా ఇళయరాజా.. మంజుమ్మల్ బాయ్స్ టీమ్కి నోటీసులు

Ilayaraja: ఇదే పని పెట్టుకున్నావా ఇళయరాజా.. మంజుమ్మల్ బాయ్స్ టీమ్కి నోటీసులు

ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా(Ilayaraja) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆయనొక శిఖరం. 80, 90 దశకాల్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప పాటలని అందించాడు ఇళయరాజ. అయితే కొంత కాలంగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న ఆయన.. కొంత కాలంగా ఒక పని పెట్టుకున్నారు. అదేంటంటే.. తన అనుమతి లేకుండా ఆయన పాటలను సినిమాల్లో వాడటంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

అలా.. ఇటీవల  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలి సినిమా టీజర్ లో తన పాటను వాడినందుకు చిత్ర యూనిట్ కూడా నోటీసులు పంపారు. ఇళయరాజా. తాజాగా మరో సూపర్ హిట్ సినిమాకు కూడా నోటీసులు పంపారు ఆయన. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. నిజ జీవిత సంఘటన ఆధారంగా వచ్చిన ఈ సినిమా రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

ఇక ఈ సినిమాలో 1991లో ఇళయరాజా- కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన గుణ చిత్రంలోని  కణ్మణి అన్బోడు పాటను ఉపయోగించారు. దాంతో.. తన అనుమతి లేకుండా తాను స్వరపరిచిన పాటను సినిమాలో వాడుకున్నందుకు మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు పంపారు ఇళయరాజా. కాపీరైట్ యాక్ట్ ప్రకారం కణ్మణి అన్బోడు పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందుతాయని, ఆయన అనుమతి లేకుండా పాటను సినిమాలో వాడే హక్కు ఎవరికీ లేదని, అందుకు పరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.