నాగ్ 100వ సినిమా లాక్.. టైటిల్ కూడా ఫిక్స్..! ల్యాండ్‌మార్క్ ఎంట్రీకి పెద్ద ప్లానింగే!

నాగ్ 100వ సినిమా లాక్.. టైటిల్ కూడా ఫిక్స్..! ల్యాండ్‌మార్క్ ఎంట్రీకి పెద్ద ప్లానింగే!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రజెంట్ 'కుబేర', 'కూలీ' మూవీల్లో సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ పోషిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత తన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

నాగ్ తన 100వ చిత్రాన్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తారని.. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కుతోందని టాక్. కొత్త కథలు, కొత్త దర్శకులతో ఎల్లప్పుడూ రిస్క్లు తీసుకున్నట్లే.. ఈ సారి కూడా నాగ్ అలాగే చేశారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే ‘కింగ్ 100’అనే టైటిల్ను ఫిక్స్ చేశారని సమాచారం. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని వినికిడి. అంతేకాదు.. జులైలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ను నాగార్జున బర్త్ డే (ఆగస్టు 29న) రివీల్ చేస్తారనే టాక్ సినీ సర్కిల్స్ వినిపిస్తోంది. దీంతో అక్కినేని అభిమానులు, నాగ్ 100వ చిత్రం కోసం ఇప్పటినుంచే ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలా ఉంటుందో వేచి చూడాలి.

అయితే, రీసెంట్ టైమ్స్ వరకు.. నాగార్జున వందో చిత్రానికి పూరి జ‌గ‌న్నాధ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు బాగా వినిపించాయి. కానీ, వారెవ్వరికి కాకుండా తమిళ డైరెక్టర్ కార్తీక్కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకు కారణం కార్తీక్ మేకింగ్ విధానానికి ఇంప్రెస్ అయ్యాడట. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SIIMA (@siimawards)

డైరెక్టర్ కార్తీక్.. గతంలో తమిళంలో ‘నితం ఓరువానం" చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగులో 'ఆకాశం' పేరుతో డబ్ అయ్యింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆ చిత్రం ఆడలేదు. కానీ దర్శకుడు కథను తెరపై చూపించిన విధానం నాగ్‌కి బాగా నచ్చిండంతోనే వందో మూవీ బాధ్యతలు అప్పగించినట్లు సినీ వర్గాల్లో టాక్.