
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా దాదాపు ఒక సంవత్సరం తర్వాత మొదటిసారిగా మీడియాకు ముఖం చూపించారు. నవంబర్ 2022లో అశ్లీల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆయన.. అప్పటి నుంచి బయట ఎక్కడికెళ్లినా ముసుగులు ధరించే కనిపించారు. తాజాగా ఓ ప్రెస్ ఈవెంట్లో పాల్గొన్న కుంద్రా.. తన ఆటోమేటిక్ ఐరన్ మాస్క్‌ని తీసివేసి, చిరునవ్వుతో తన ముఖాన్ని చూపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న మరో వీడియోలో గతేడాది చెలరేగిన వివాదంపై కన్నీళ్లు ఆపుకుంటూ కనిపించారు. "ఇది నా కుటుంబానికి చాలా బాధ కలిగించింది. నా భార్య, పిల్లలు, నా కుటుంబాన్ని ఎందుకు లాగుతారు? మీ వేళ్లు నా వైపు చూపండి కానీ నా కుటుంబం వైపు కాదు" అని కుంద్రా తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం చూడవచ్చు.
ALSO READ : నీ బంగారం ఫోన్ ఊరికే ఇస్తారా ఏంటీ : ఊర్వశికి ట్రీట్ మెంట్ కండీషన్
రాజ్ కుంద్రా బయోపిక్
చిత్రనిర్మాత-కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ 'UT69' కోసం రాజ్ కుంద్రా, మునవర్ ఫరూకీతో చేతులు కలిపారు. ఈ బయోపిక్‌లో కుంద్రా జైలులో గడిపిన సమయాన్ని ట్రేస్ చేయనున్నారు. ఎట్టకేలకు అదే ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. చిత్రం నవంబర్ 3 న విడుదల కానుంది.