టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక ఊచకోత కోయడానికి సిద్ధమయ్యారు. ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. మే 20న మనోజ్ బర్త్‌డే కానుకగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
బ్రిటిష్ కాలం నాటి రక్తం మరిగే కథ!
హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. స్వాతంత్య్ర సంగ్రామ నేపథ్యంలో, గాంధీజీ ఉద్యమాలను అణచివేయడానికి బ్రిటిష్ వారు కుట్రలు పన్నుతున్న తరుణంలో.. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒకే ఒక్కడిగా ‘డేవిడ్ రెడ్డి’ ఎంట్రీ ఇస్తాడు. బ్రిటిష్ వారు సైతం ఇతడిని చూసి భయంతో ‘రాక్షస్ రెడ్డి’ అని పిలుచుకుంటారంటే మనోజ్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
►ALSO READ | Manchu Manoj : నెల తిరిగితే ఈఎంఐలు, అప్పుల కిస్తీలు... మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’ కాన్సెప్ట్ వీడియో అవుట్!
హై-వోల్టేజ్ యాక్షన్.. !
టీజర్‌లో మంచు మనోజ్ ఫెరోషియస్ లుక్, రౌద్ర రూపం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో మనోజ్ సరసన ఉక్రేనియన్ బ్యూటీ మరియా రియాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తుండగా, రమ్యకృష్ణ, సముద్రఖని, అభయ్ డియోల్, కాంచన వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ కట్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై భరత్ మోతుకూరి, నల్లాగంగుల వెంకట్ రెడ్డి ఈ పాన్- ఇండియా మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
తుఫాన్ రాబోతోంది..
టీజర్ రిలీజ్ సందర్భంగా మనోజ్ ఎక్స్ లో స్పందిస్తూ.. "నా సర్వస్వాన్ని ఈ సినిమా కోసం ధారపోశాను. మా డైరెక్టర్ విజన్, నమ్మకం వల్లే ఈ అగ్ని పర్వతం రూపుదిద్దుకుంది. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికే దీన్ని మలిచాం. ఇది కేవలం మొదటి నిప్పుకణిక మాత్రమే.. రాక్షస్ రెడ్డి మిమ్మల్ని త్రిల్ చేయడం ఖాయం.. త్వరలోనే తుఫాన్ రాబోతోంది" అంటూ రాసుకొచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న ఈ యాక్షన్ విజువల్ వండర్.. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతోంది.
𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐮𝐫𝐲. 𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐫𝐞. 𝐒𝐭𝐞𝐩 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐨𝐟 #DavidReddy ❤️🔥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 20, 2026
I poured everything I had into this journey.
Every moment was driven by conviction, while our director’s relentless vision and trust gave this force…
