టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తన మార్క్ వింటేజ్ కామెడీ, హై-వోల్టేజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లలో నవ్వుల పూయించడానికి రెడీ అయ్యారు. ఈ రోజు ( మే 20 న ) మనోజ్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా గురించి మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘వడ్డీ కాసుల వాడ’ అనే ఊరమాస్, క్యాచీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అంతే కాదు ఒక అదిరిపోయే కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు.
భారీ అంచనాలతో..
ఒకప్పుడు మనోజ్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బిందాస్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్‌లో మనోజ్ సినిమా చేస్తుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ‘వడ్డీ కాసుల వాడ’ వీడియో మరింత ఆకట్టుకుంటోంది. సామాన్యుల కష్టాలను ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు ఉంది.
ఈఎంఐ కష్టాలు.. నవ్వుల వరదలు!
ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో చూస్తే ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడికి తన కథే గుర్తొస్తుంది. ప్రస్తుతం సమాజంలో నెల తిరిగితే ఈఎంఐలు, అప్పుల కిస్తీలు అంటూ సామాన్యుడు పడుతున్న తిప్పలను ఇందులో చాలా ఫన్నీగా చూపించారు. చేతిలో పైసల్లేక, అప్పుల వాళ్ల టార్చర్ భరించలేక మనోజ్ దేవుడికి మొరపెట్టుకునే సీన్ నవ్వులు పూయిస్తూనే, అందరికీ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయిపోయేలా ఉంది. మనోజ్ టైమింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని అటు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. రంగంలోకి సీబీఐ..!
క్రేజీ టీమ్..
ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను తేజ్ ఉప్పలపాటి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జీకే), అజయ్ సుంకర, దయ పన్నెం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఏటీవీ (ATV) ఈ సినిమాను సమర్పిస్తోంది. మొత్తానికి మనోజ్ మార్క్ ఎనర్జీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన ఈ ‘వడ్డీ కాసుల వాడ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వడ్డీలతో సహా వసూళ్లు రాబడతాడో చూడాలి. సినిమా గురించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.
