ఇన్స్టా షేక్.. రకుల్ డ్రస్..కిరాక్ లుక్స్

 ఇన్స్టా షేక్.. రకుల్ డ్రస్..కిరాక్ లుక్స్

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగులో పెద్దగా పరిచయం అవసరం లేని ముద్దుగమ్మ. చిన్న సినిమాలతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎర్ర చీరలో తన వయ్యారాలు ఒలకబోస్తోంది. 

ఒకానొక సమయంలో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు సినిమా ను సైతం డేట్లు లేని కారణంగా వదులుకున్న ఈ అమ్మడు మూడు నాలుగు సంవత్సరాల పాటు స్టార్‌ హీరోల అందరితో నటించింది. ఈ అమ్మడి స్టార్‌ డమ్‌ మూడు నాళ్ల ముచ్చట అన్నట్లుగా మారి పోయింది.

వరుసగా చేసిన సినిమాల్లో చాలా వరకు నిరాశ పరచడంతో పాటు, దాదాపు అందరు హీరోలతో ఈమె నటించడం వల్ల కొత్తగా మళ్లీ ఈమెతో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపడం లేదు.

అంతే కాకుండా ఈమెకు ఆ మధ్య హిందీ సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడం తో తెలుగు లో మొత్తానికి అవకాశాలు పోయాయి. సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంటూ దూసుకు పోతుంది.

హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలిచి ఉంటుంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇన్స్టాను షేక్ చేస్తున్నాయి. 

Also Read :- షారుఖ్ డంకీ టీజర్ వచ్చేసింది.. సలార్ను ఢీ కొట్టే సీనుందంటారా?

సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో విచ్చల విడిగా చేస్తారు. కానీ ఈ అమ్మడి అందాల ఆరబోత కు ఒక లెక్క ఉంటుంది. ఎంత స్కిన్‌ షో చేసినా కూడా ఎబ్బెట్టుగా కాకుండా చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒంపు సొంపులు చూపిస్తూ కవ్విస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ కొత్త ఫొటోలనూ మీరూ చూసేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)