Rakul Preeth Singh: పెళ్లి వీడియో షేర్ చేసిన రకుల్..కలర్ ఫుల్ లవ్ ఈవెంట్

Rakul Preeth Singh: పెళ్లి వీడియో షేర్ చేసిన రకుల్..కలర్ ఫుల్ లవ్ ఈవెంట్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ (Jocky Bhgnani)  (ఫిబ్రవరి 21న) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుక గోవాలోని ITC గ్రాండ్ సౌత్ ఆనంద్ కరాజ్ అనే పంజాబీ శైలిలో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ వేడుకలో బంధువులు, కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు.

లేటెస్ట్గా రకుల్ తన పెళ్లి వీడియోను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మెహందీ, హల్దీ, మ్యారేజ్ వేడుకకు సంబంధించిన వీడియో నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ కలర్ ఫుల్ వేడుకలో..స్టైలిష్ లుక్స్, డ్యాన్స్ పెర్ఫార్మన్స్తో రకుల్ పెళ్లి వీడియో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం రకుల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

వీరి వివాహ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు.  

అయితే, రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఇద్దరూ ఆ తర్వాత ప్రేమికులయ్యారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)