Rakul Preet Singh: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth singh) బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ(Jocky Bhgnani) ఈ రోజు (ఫిబ్రవరి 21న) వివాహబంధంలోకి అడుగుపెట్టారు.ఇవాళ ఉదయం ‘చుద్దా’ అనే సంప్రదాయ కార్యక్రమం మొదలవ్వగా..తాజాగా గం 3.30 నిమిషాలకు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

వీరి పెళ్లి వేడుక గోవాలోని ITC గ్రాండ్ సౌత్ ఆనంద్ కరాజ్ అనే పంజాబీ శైలిలో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.ఈ వేడుకలో బంధువులు, కొద్ది మంది మిత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఇక ఈ పెళ్లి అనంతరం ఈ కొత్త జంట బాలీవుడ్ ప్రమఖులకు గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నారు.