టెన్త్ ఎగ్జామ్స్కు టైమ్ అయింది.. ఎగ్జామ్సెంటర్ లొకేషన్ కోసం క్యూఆర్ కోడ్

టెన్త్ ఎగ్జామ్స్కు టైమ్ అయింది.. ఎగ్జామ్సెంటర్ లొకేషన్ కోసం క్యూఆర్ కోడ్
  • హాజరుకానున్న 5.28 లక్షల మంది స్టూడెంట్స్
  • ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు
  • ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి 
  • హాల్​టికెట్పై ఎగ్జామ్ సెంటర్ లొకేషన్​ క్యూఆర్ కోడ్
  • ముగిసిన ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్
  • ఈ ఏడాది తగ్గిన మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్ కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 5,17,827 మంది కాగా, గతంలో ఫెయిలై మళ్లీ రాస్తున్న వారు 10,512 మంది ఉన్నారు. దీంట్లో అమ్మాయిలు 2,60,285 మంది, అబ్బాయిలు 2,67,954 మంది ఉన్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఎగ్జామ్​ సెంటర్ లొకేషన్ ​కోసం క్యూఆర్ కోడ్
ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అంటే ఉదయం 9.35 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 

తొలిసారిగా పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ప్రింట్ చేశారు. ఫోన్​ లో స్కాన్ చేస్తే లోకేషన్ చూపిస్తుంది. మరోపక్క విద్యార్థులు వాట్సాప్ నంబర్ 80969 58096కు హాయ్ అని పెట్టి హాల్ టికెట్లను పొందవచ్చు. అయితే, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కఠినంగా నిషేధించామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. 

ముగిసిన ఇంటర్ ఎగ్జామ్స్ 
గత నెల 25న ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. సుమారు 95 శాతం మంది విద్యార్థులు అటెండ్ అయ్యారని అధికారులు తెలిపారు.  కమాండ్ కంట్రోల్ లోని సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణతో మాల్‌‌‌‌ప్రాక్టీస్ కేసులు భారీగా తగ్గాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. 2025లో 115 మాల్‌‌‌‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా, ఈ సారి ఆ సంఖ్య 54కు తగ్గిందని వివరించారు. ఈ ఏడాది ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఆఫీసర్లు 10,426 సార్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేపట్టారు. కాగా, పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు హాస్టళ్ల నుంచి ఇంటిబాట పట్టారు.