Rakul Preet singh Wedding: రకుల్ పెళ్లి కోసం 45 ఎకరాల రిసార్ట్.. ఒక్కో రూమ్ రెంట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

Rakul Preet singh Wedding: రకుల్ పెళ్లి కోసం 45 ఎకరాల రిసార్ట్.. ఒక్కో రూమ్ రెంట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth singh) పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ(Jocky Bhgnani)తో ఏడడుగులు వేయనుంది రకుల్. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా జరుగనుంది. ఇక ఈ పెళ్లి కోసం సరికొత్తగా ఎకో ఫ్రెండ్లీ సిస్టం ను ఎంచుకున్నారు ఈ జంట. అంటే ఈ పెళ్లి వేడుకల్లో డీజే, ప్లాస్టిక్ వాడకం, పేపర్ వాడకం కానీ ఉండవని తెలుస్తోంది. దీంతో ఈ జంటపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే పెళ్లి విషయంలో ఎకో ఫ్రెండ్లీ సిస్టంను ఎంచుకున్న రకుల్, జాకీ ఖర్చు మాత్రం భారీగానే  చేయనున్నారట. అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ పెళ్లి వేడుక కోసం సౌత్ గోవాలోని 45 ఎకరాల ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌ హోటల్‌ ను బుక్ చేసుకున్నారట. ఇది గోవాలోనే అత్యంత విలాసవంతమైన హోటల్ గా గుర్తింపు పొందిందని సమాచారం. 

కేవలం హోటల్ మాత్రమే కాదు హోటల్ లో ఉండే ఒక్కో రూమ్ కూడా అంతే ఖరీదైందట. ఒక్కో రూమ్ ఖరీదు రూ.19 వేల నుంచి 75 వేల వరకు ఉంటుందని టాక్. రకుల్ ప్రీత్ సింగ్‌, జాకీ భగ్నానీల పెళ్లి కోసం మొత్తం మూడు రోజుల పాటు ఐటీసీ హోటల్ ను బుక్ చేసుకున్నారట. ఇక రకుల్, భగ్నాన్ని పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని జంట తమ పెళ్ళోకోసం చేస్తున్న ఖర్చు ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.