ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. నెటిజన్స్ ప్రశంసలు

ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. నెటిజన్స్ ప్రశంసలు

సాధారణంగా స్టార్స్ పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్ లో ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, కలర్ ఫుల్ డెకొరేషన్స్, స్టార్ సెలెబ్రెటీలు, డీజే మోతలు అబ్బో ఇలాంటివి చాలానే ఉంటాయి. అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్(Rakul Preeth singh) మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా తన పెళ్లి చేసుకోనుందట. ఇందుకోసం సరికొత్త కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preth singh), బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ(Jockey Bhagnani) కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వీరి పెళ్ళి ఫిబ్రవరి 21న గోవా వేదికగా జరుగనుంది. అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 19నుంచే మొదలుకానున్నాయి. అయితే.. రకుల్, జాకీ జంట తమ పెళ్లి కోసం ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని అనుసరించనున్నారట. అంటే.. టపాసులు పేల్చడం, డీజే సౌండ్స్ సిస్టమ్స్ వంటివి ఉండవట. వాటి వలన పర్యావరణ జరుగుతుందని వాటిని అవాయిడ్ చేస్తున్నారట. అంతేకాదు పేపర్ కూడా వేస్ట్‌ అవకుండా వివాహ ఆహ్వానాన్ని డిజిటల్ రూపంలోనే చేయిస్తున్నారట.

అయితే.. రకుల్, జాకీల ఎకో ఫ్రెండ్లీ విధానం గురించి తెలుసుకున్న నెటిజన్స్ ఈ జంట పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జంటలాగే అందరు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకుంటే బావుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్, జాకీల పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.