గేమ్ ఛేంజర్ షూట్లో గాయపడిన రాంచరణ్? అందుకేనా షూటింగ్ క్యాన్సిల్!

గేమ్ ఛేంజర్ షూట్లో గాయపడిన రాంచరణ్? అందుకేనా షూటింగ్ క్యాన్సిల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే చాలా గ్యాప్ తరువాత మొదలైన ఈ సినిమా షూటింగ్ మల్లి క్యాన్సిల్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి రెండు కారణాలు వినిపిస్తున్నాయి. 

ALSO READ : IND vs AUS: గిల్ రికార్డుల మోత.. వన్డే చరిత్రలో ఒకే ఒక్కడు

అందులో ఒకటి ఈ షెడ్యూల్ కు సంబందించిన ఆర్టిస్టులు అందుబాటులో లేరట. అందువల్ల ఈ షెడ్యూల్ ను అక్టోబర్ 6 వరకు వాయిదా వేశారట. ఇక రెండో కారణం ఏంటంటే.. తాజాగా మొదలైన షూట్ లో రామ్ చరణ్ మొహానికి చిన్న గాయమయిందట. ఈ కారణంగా రామ్ చరణ్ కు కొన్ని రోజులు రెస్ట్ అవసరమని సూచించారట డాక్టర్స్. అందుకే ఈ సినిమాను వారం రోజుల పాటు పోస్ట్ పోన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు కారణాలలో ఏది నిజం అనేది తెలియదు కానీ.. గేమ్ ఛేంజర్ షూటింగ్ మాత్రం మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. 

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.