IND vs AUS: గిల్ రికార్డుల మోత.. వన్డే చరిత్రలో ఒకే ఒక్కడు

IND vs AUS: గిల్ రికార్డుల మోత.. వన్డే చరిత్రలో ఒకే ఒక్కడు

టీమిండియా నయా సంచలనం శుభమాన్ గిల్ ప్రస్తుతం అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. ఆడేది ఎక్కడైనా, ప్రత్యర్థి ఎవరైనా,ఎంత టాప్  బౌలర్ అయినా గిల్ పరుగుల ప్రవాహం ఆగట్లేదు. ముఖ్యంగా వన్డేల్లో ఈ పంజాబీ ప్లేయర్ ఆట చూస్తే మరో సచిన్, కోహ్లీని గుర్తు చేస్తున్నాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా సెంచరీ బాదేస్తున్నాడు. పట్టుమని పాతికేళ్ల వయసు లేకుండానే ఆల్ టైం రికార్డులు కొట్టేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాపై ఇండోర్ లో సెంచరీ చేసిన గిల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

వన్డేల్లో ఆల్ టైం రికార్డ్..
 
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీ ఛాన్స్ మిస్ చేసుకున్న గిల్.. నిన్న జరిగిన రెండో వన్డేలో ఆ లోటు తీర్చుకున్నాడు. 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఆసీస్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 1900 పరుగులు మైలురాయిని గిల్ కేవలం 35 ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ల్లోనే అందుకొని వన్డేలో ఆల్ టైం రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో ఈ రికార్డ్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. 35 ఇన్నింగ్స్ లో ఆమ్లా 1844 పరుగులు చేసాడు.

ALSO READ : దళిత మహిళను వివస్త్రను చేసి, నోట్లో మూత్రం పోసి..

ఈ ఏడాది మరెన్నో రికార్డులు 

ఇక వన్డేలో వేగంగా 6 సెంచరీలు చేసిన బ్యాటర్ గా, వన్డేల్లో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు, పరుగులు,సిక్సులు, క్యాచులు ఇలా ఎన్నో రికార్డులు ఈ  ఏడాది గిల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అంతేకాదు ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా గిల్ నిలిచాడు. ఇలా ఈ ఏడాది ఎన్నో రికార్డులు సెట్ చేసిన గిల్ వన్డేలో టాప్ ర్యాంక్ పై కన్నేశాడు. మూడో వన్డేలో గిల్ మరో 20 పరుగులు చేసినట్లయితే బాబర్ అజామ్ ని వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంటాడు.