మాదాపూర్ లో హిట్ అండ్ రన్ కేసు.. ట్రాఫిక్ హోమ్ గార్డ్ ను ఢీకొట్టి నిందితుడు పరార్...

మాదాపూర్ లో హిట్ అండ్ రన్ కేసు.. ట్రాఫిక్ హోమ్ గార్డ్ ను ఢీకొట్టి నిందితుడు పరార్...

హైదరాబాద్ లోని మాదాపూర్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. ఈ ఘటనలో ట్రాఫిక్ హోమ్ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( డిసెంబర్ 30 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మాదాపూర్ పర్వత్ నగర్ సిగ్నల్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీమ్ ను కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి పరారయ్యాడు నిందితుడు. ఈ ఘటనలో హోమ్ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి.

కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలైన హోమ్ గార్డును స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో హోమ్ గార్డ్ కాలు విరిగినట్లు నిర్దారించారు డాక్టర్లు. ప్రస్తుతం హోమ్ గార్డ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. 

Also Read : న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోమ్ గార్డ్ నయీం ను పరామర్శించారు ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్,ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ హనుమంత్ రావు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.