లండన్: 2026 టీ20 వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ జట్టును ప్రకటించింది. 15 మంది పేర్లతో కూడిన జట్టును మంగళవారం (డిసెంబర్ 30) ఈసీబీ అనౌన్స్ చేసింది. యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యాషెస్ సిరీస్‌లో గాయపడ్డ డేంజరస్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
మెగా టోర్నీ ప్రారంభ సమయానికి ఒకవేళ ఆర్చర్ కోలుకోకపోతే అతడి స్థానంలో బ్రైడాన్ కార్స్ బరిలోకి దిగనున్నాడు. ఇక, తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరపున ఒక్క వైట్-బాల్ మ్యాచ్ కూడా ఆడని పేసర్ జోష్ టంగ్ అనుహ్యంగా టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా టంగ్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.
ALSO READ : భారీ సెంచరీతో విజృంభించిన జురెల్..
2026 టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా అతిథ్యమిస్తున్నాయి. 2026, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఫిబ్రవరి 7న పాకిస్తాన్–నెదర్లాండ్ మ్యాచ్‌తో తెరలేవనుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.
ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు టోర్నమెంట్ లో భాగం కానున్నాయి
ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు
హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్
