పీజీ హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి.. ప్రముఖ ఐటీ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

పీజీ హాస్టల్లో గ్యాస్ సిలిండర్ పేలి.. ప్రముఖ ఐటీ కంపెనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

బెంగుళూరులోని కుందనహళ్లిలో పీజీ హాస్టల్లో గ్యాస్ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందారు. మంగళవారం ( డిసెంబర్ 31 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బెంగుళూరులోని కుందనహళ్లిలోని సెవెన్ హిల్స్ సాయి కో లివింగ్ స్పేస్ పీజీ హాస్టల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 23 ఏళ్ళ అరవింద్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఏడు అంతస్తుల్లో 43 గదులు ఉన్న పీజీ హాస్టల్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో పేలుడు సంభవించడంతో ఈ ఘటన జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో పొగ రావడంతో టెర్రస్ పై ఉన్న మరో ఇద్దరితో సహా కిందికి వచ్చాడు అరవింద్. అదే సమయంలో సిలిండర్ బ్లాస్ట్ అయ్యి అరవింద్ మరణించి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిలో ఒకరు పీజీలో హెల్పర్ కాగా, మరో ఇద్దరు ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయిస్ అని సమాచారం.

ఈ ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పీజీ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు పోలీసులు.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన అరవింద్, క్యాప్‌జెమినిలో సీనియర్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.గాయపడిన మరో ముగ్గురు కర్నూలుకు చెందిన 28 ఏళ్ల వెంకటేష్, ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ వర్మ, ఉత్తరాఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సివి గోయల్ గా గుర్తించారు పోలీసులు. క్షతగాత్రులు ప్రస్తుతం నగరంలోని బ్రూక్‌ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.