బీ కేర్ ఫుల్ : చైనీస్ జాస్మిన్ కాఫీ తాగితే లివర్ డ్యామేజ్ అవుతుందా..?

బీ కేర్ ఫుల్ : చైనీస్ జాస్మిన్ కాఫీ తాగితే లివర్ డ్యామేజ్ అవుతుందా..?

టీ కాఫీలు తాగే అలవాటు లేని వారున్నారంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు మధ్య మధ్యలో టీనో కాఫీనో పడక పోతే మైండ్ దారిలోకి రాదనేలాగ అవి చాలా మంది అడిక్ట్ అయిపోతుంటాయి. కొందరైతే బెడ్ కాఫీ, బెడ్ టీ అంటూ నిద్ర లేచిన వెంటనే తియతియ్యగా లగాయించేస్తుంటారు. అందులో హెర్బల్ టీలు, కాఫీలు మరింత స్పెషల్. అద్భుతమై సువాసనతో దూరం నుంచే ఆకర్షిస్తుంటాయి.  ఎందుకంటే అవి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి.. వివిధ ఫ్లేవర్లలో వస్తుంటాయి కాబట్టి. 

అయితే ఈ డ్రింక్స్ మనకు రిలీఫ్ ఇచ్చే ఏజెంట్స్ గా కాకుండా.. అందులో ఉండే ఇంగ్రీడియెంట్స్ కారణంగా లేనిపోని జబ్బులు లేదా సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీసే పదార్థాలుగా మారితేనే అసలు సమస్య. మంచి బ్రాండ్ నేమ్ తో లేబుల్ వేసినప్పటికీ.. కొన్ని సార్లు విషపూరిత మొక్కల నుంచి వచ్చిన మిశ్రమాలను ప్యాక్ చేయవచ్చు. ప్రమాదకరమైన చైనీస్ జాస్మిన్ కాఫీ తాగిన ఒక ఇండియన్ ఆస్పత్రిపాలైన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మందిలో ఆందోళన కలిగిస్తోంది. 

టేస్టీ కోసం చూస్తే హెల్త్ డ్యామేజ్ అయితే..

ఒక ఇండియన్ చైనీస్ జాస్మిన్ కాఫీని కేవలం ఒక వారం పాటు తాగి.. తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన సంచలనంగా మారింది. హెపటైటిస్, కామెర్లతో ఆసుపత్రిలో చేరడం ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో ది లివర్ డాక్ అని పిలువబడే డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్.. ఈ ఘటనను X లో షేర్ చేశాడు. డయాన్ ఎర్ వా అనే బ్రాండ్ కు చెందిన కాఫీ ని ఒక వారంరోజులు తాగటంతో క్లాసిక్ లివర్ డిస్ట్రెస్ సంకేతాలను రేకెత్తించిందని ఆయన ఎక్స్ లో వెల్లడించారు.

ఎంతో రీసెర్చ్ తర్వాత జాస్మిన్ కాఫీ కారణంగానే ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయినట్లు గుర్తించినట్లు ఫిలిప్స్ ఎక్స్ లో పేర్కొన్నాడు.  కళ్ళు పసుపు రంగులోకి మారటం, మూత్రం కూడా పసుపు రంగులోనే రావటం, దీనికి తోడు చేతులు,కాళ్ళపై తీవ్రమైన దురద పెట్టడం గుర్తించినట్లు చెప్పాడు. ఆ వ్యక్తి వారం రోజుల పాటు.. రోజుకు ప్రారంభమయ్యే ముందు అతను ఒక వారం పాటు రోజుకు 2-3 కప్పులు ఈ నీస్ జాస్మిన్ కాఫీని తాగాడని.. ప్రూఫ్ గా కాఫీ సాచెట్ ఫోటోను షేర్ చేశాడు. 

అన్ని జాస్మిన్ కాఫీలు సురక్షితం కాదు:

జాస్మిన్ కాఫీలు, టీలు అన్నీ సురక్షితం కాదని డాక్టర్ తెలిపారు. జాస్మినం అఫిసినేల్, జాస్మినం గ్రాండిఫ్లోరం లేదా జాస్మినం సాంబాక్ వంటి నిజమైన జాస్మిన్ రకం టీలు మంచివని తెలిపారు. వీటిని సువాసనలు, ఫ్లేవర్స్ ను ఆహారంలో వాడుతుంటారని చెప్పారు. కానీ కొన్ని నకిలీ మొక్కల పట్ల జాగ్రత్త వహించాలని సలహా ఇస్తున్నాడు. 

సాధారణంగా జాస్మిన్ అని పిలువబడే మరికొన్ని మొక్కలు చాలా విషపూరితమైనవని.. కాలేయానికి హాని కలిగిస్తాయని చెప్పాడు. ఎల్లో జెస్సామైన్, నైట్-బ్లూమింగ్ జెస్సామైన్, సెస్ట్రమ్ డైర్నమ్  స్టార్ జాస్మిన్ వంటి కొన్ని ప్రమాదకరమైన రకాల లిస్టును షేర్ర చేశాడు. ఇవి కాలేయం, గుండె, మూత్రపిండాలకు హాని కలిగిస్తాయని.. రాత్రిపూట వికసించే మల్లె అత్యంత ప్రమాదకరమైనదని.. ఎందుకంటే ఇది నిజమైన మల్లె సూచించాడు. 

నైట్ జాస్మిన్ లో విష పదార్థాలు:

రాత్రిపూట వికసించే మల్లె లో అన్ని భాగాలు విషపూరితమైనవని, ముఖ్యంగా దాని బెర్రీలలో  స్టెరాయిడ్ గ్లైకోసైడ్ ఉంటుందని చెప్పాడు. ఇది విటమిన్ D3 రూపంలోకి హైడ్రోలైజ్ చేయబడుతుంది, ఇది అధిక కాల్షియం గ్రహించడంతో తీవ్రమైన అనారోగ్యానికి, అవయవాల డ్యామేజ్ కి కారణమవుతుందని డాక్టర్ ఫిలిప్స్ అన్నారు. మోసగాళ్ళు ఇలాంటి సువాసనలతో వినియోగదారులను మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.