ప్రజల విశ్వాసానికి నిదర్శనం ఈ గెలుపు

 ప్రజల విశ్వాసానికి నిదర్శనం ఈ గెలుపు

స్టేషన్ ఘనపూర్, వెలుగు: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులకు 13 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీతో చైర్​పర్సన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఫలితాల అనంతరం ఎమ్మెల్యే కడియం క్యాంప్ ఆఫీస్​ వద్ద గెలుపొందిన అభ్యర్థులతో కలిసి సంబురాలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలిచిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారనే విషయం స్పష్టమైందన్నారు. దీంతో తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. స్టేషన్ ఘనపూర్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.