జనగామ అర్బన్, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి జాతర సందర్భంగా మహాశివరాత్రికి జనగామ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శుక్రవారం జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతి బస్స్టాండ్ లో బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాఊపి కొమురవెల్లికి బస్సులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ జనగామ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 14 నుంచి ప్రతి పది నిమిషాలకి ఒక బస్సు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు బస్స్టాండ్ ఎంకైరీ 73829 26139 ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
