డీడీఎస్ అంటే చిరుధాన్యాల ప్రయోగశాల : రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

డీడీఎస్ అంటే చిరుధాన్యాల  ప్రయోగశాల :  రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
  •     రాష్ట్ర  రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి

ఝరాసంగం, వెలుగు: డెక్కన్​ డెవలప్​మెంట్​ సొసైటీ అంటేనే చిరుధాన్యాల పంటలకు ప్రయోగశాల వంటిదని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండల పరిధిలోని మాచునూర్​ గ్రామ శివారులో గల పచ్చసాలె ఆవరణలో 26వ పాత పంటల ముగింపు జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నేటికి ఇలాంటి మహిళా రైతులు ఉండబట్టే పాత పంటలు కనుమరుగు కాకుండా ఉన్నాయని కొనియాడారు. రసాయన ఎరువులు వాడకం వల్ల భూమి సారాన్ని కోల్పోవడమే కాకుండా వాటి ద్వారా పండిన పంటలు ఆహరంగా తీసుకోవడంతో ప్రజలు అనేక రకాల రోగాలకు గురవుతున్నారన్నారు. 

డీడీఎస్​మహిళలకు బోనస్​ ఇచ్చేలా ప్రభుత్వంతో, కోతులు, అడివిపందులు, జింకల బెడద నుంచి పంటలు కాపాడడానికి నాబార్డ్​​వారితో మాట్లాడుతానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్​ మాధవి, డీడీఎస్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ దివ్య, రైతు సంక్షేమ కమిషన్​ మెంబర్​ ఆఫ్​ సెక్రటరి గోపాల్, ప్రొఫెసర్​ నందకిషోర్​, రైతు కమిషన్ సభ్యులు రాములునాయక్, రామ్​రెడ్డి గోపాల్​రెడ్డి, కేవీ నర్సింహరెడ్డి, ఏడీఏ భిక్షపతి, తహసీల్దార్​ భాస్కర్, డీడీఎస్​ మహిళా రైతులు పాల్గొన్నారు.