ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనం : మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనం : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్​ కర్నూల్, వెలుగు: మున్సిపల్  ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్రహ్మరథం పట్టరని, ఈ ఫలితాలు ప్రజాప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్​లో మంత్రి మాట్లాడుతూ  ఏ ఎన్నికలైనా విజయం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేనని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతోనే విజయం సాధించామని చెప్పారు. 

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి అంకితమవుతామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్  జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలను గెలిపించి, ప్రజాపాలనపై ప్రజలు తమ సంతృప్తిని తెలియజేశారని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

కల్వకుర్తిలో ర్యాలీ..

కల్వకుర్తిలో కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల కాంగ్రెస్​ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ది, ప్రజలకు చేసిన సేవలకు ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు.

బ్రహ్మరథం పట్టారు..

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో అత్యధిక వార్డులలో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించడం సంతోషంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.