మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు సంబురాలు

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు సంబురాలు

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ పార్టీ గెలుపుతో కార్యకర్తలు, నాయకులు గెలుపు సంబురాలు జరుపుకొన్నారు. శుక్రవారం వెలువడిన ఫలితాలతో ఆ పార్టీ నేతలు రంగులు చల్లుకుని, పటాకులు పేల్చి వేడుకలు నిర్వహించుకున్నారు.

మహబూబాబాద్​ మరిపెడలో ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్​ విజేతలతో కలిసి సంబురాలు చేసుకోగా, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో మండలాధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకులు జరుపుకున్నారు. కాగా, పలుచోట్ల లెప్ట్​ పార్టీ నేతలు గెలుపొందగా, సంబురాలు చేసుకున్నారు.