బౌరాపూర్ జాతరను సక్సెస్ చేయాలి : డీఆర్డీఏ డీపీఎం ఆలూరి చెన్నయ్య

బౌరాపూర్  జాతరను సక్సెస్ చేయాలి :   డీఆర్డీఏ డీపీఎం ఆలూరి చెన్నయ్య
  •     చెంచుల ఉచిత ప్రయాణానికి 14 ఆర్టీసీ బస్సులు
  •     డీఆర్డీఏ డీపీఎం ఆలూరి చెన్నయ్య

లింగాల, వెలుగు: మండలంలోని బౌరాపూర్ లో పురాతనమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే చెంచుల జాతరను సక్సెస్​ చేయాలని డీపీఎం ఆలూరి చెన్నయ్య పిలుపునిచ్చారు. ఈ నెల14 నుంచి 16 వరకు బౌరాపూర్ లో జరిగే పండుగకు చెంచులను తరలించడంపై  శుక్రవారం మండల చెంచు మహిళా సమాఖ్య ఆఫీస్​లో రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో చెంచులు ఎక్కువగా నివసించే పదర, అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూర్, లింగాల, కొల్లాపూర్  మండలాలతో పాటు ఉప్పునుంతల మండలంలోని కొన్ని గ్రామాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

అచ్చంపేట డిపో నుంచి12 బస్సులు, కొల్లాపూర్  డిపో నుంచి 2 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 న గణపతిపూజ, రుద్రహోమం, అభిషేకం, అంకురార్పణ, భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం.16న అమ్మవారు, స్వామి వారికి ప్రత్యేక పూజలు, జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. నల్లమలతో పాటు నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్  నుంచి చెంచులు, ఇతరులు జాతరకు వస్తారని తెలిపారు. ఏపీఎం విజయలక్ష్మి, సీబీవో ఆడిటర్  రామకృష్ణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి చెన్నయ్య, లక్ష్మమ్మ, కాశమ్మ, సీసీలు రాజు, చందు నాయక్, జ్యోతి, రవి పాల్గొన్నారు.