సంక్రాతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఊళ్లకు వెళ్లి వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.సంక్రాంతికి వెళ్లి, వచ్చే వాహనాలకు టోల్ వసూలు చేయొద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు మంత్రి కోమటిరెడ్డి. జనవరి 9 నుంచి 14వ తేదీ వరకు టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వాలని.. ఆ రోజుల్లో టోల్ ప్లాజాల దగ్గర ఫ్రీ వే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో రిక్వెస్ట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి.
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి.పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల దగ్గర ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200శాతం అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల దగ్గర ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు.
జంక్షన్లు, జనావాసాలు, ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI, పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి.ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు కోమటిరెడ్డి.
హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు.
విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు.ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా.. సంక్రాంతి నేపథ్యంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరె డ్డి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతేడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధి కాదులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారని చెప్పారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుంది. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
రేపు నేను తూపాన్సేట్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్త. మెయిన్ గా ఎల్బీనగర్, వనస్థలిపురం,హయగ్నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతా ల్లో వేలాది వాహనాల రద్దీ ఏర్పడుతుంది. ఇక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్ కావడానికి వీల్లేదు. పండుగ రద్దీ ఉన్నన్ని రోజుల్లో రోడ్లు మూసేయొద్దు. భారీ యంత్రాలతో పనులు చేపట్టవద్దు. అత్యవసరమైనవి అయితే ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. రోడ్లపై మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలను పూర్తిగా తొ లగించాలి' అని సూచించారు.
