నిర్మల్ రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. అడ్డంగా బుక్కైన ల్యాండ్ సర్వేయర్లు

నిర్మల్ రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. అడ్డంగా బుక్కైన ల్యాండ్ సర్వేయర్లు

నిర్మల్ రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం (డిసెంబర్ 30) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ సర్వే కోసం సర్వేయర్లు లంచం డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక దాడులు చేశారు. లంచం తీసుకుంటున్న సర్వేయర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

భూమి సర్వే చేయడానికి సర్వేయర్లు రూ.15 వేల డిమాండ్ చేస్తున్నట్లు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో లంచం ఇచ్చే సమయంలో నిఘా ఉంచి సర్వేయర్లను పట్టుకున్నారు.  రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టబుడ్డారు ల్యాండ్ సర్వేయర్ బాలకృష్ణ, అతని అనుచరుడు నాగరాజ్.