- గర్భిణిని చంపింది ..భర్తేనని తేల్చిన పోలీసులు..
పెద్దమందడి, వెలుగు: అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి గర్భిణి అని చూడకుండా భార్యను చంపేశాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పెద్దమందడి ఎస్సై జలంధర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పెద్దమందడి మండలకేంద్రానికి చెందిన భాగ్యశ్రీ, మొగులయ్య దంపతుల కుమార్తె శ్వేత(19ను అదే గ్రామానికి చెందిన బాలకృష్ణకు ఇచ్చి నాలుగు నెలల క్రితం పెండ్లి చేశారు.
కొద్దిరోజులకే భర్త అదనపు వరకట్నం కోసం వేధింపులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 28న ఇంట్లోనే భార్య మెడకు చీర బిగించి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. మృతురాలి తల్లిదండ్రులు అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణలో భర్త బాలకృష్ణే మెడకు చీర బిగించి ఉరివేసి హత్య చేసినట్లు తెలిసింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
