పారిశుధ్య పనులు స్పీడప్ చేయాలి : మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

పారిశుధ్య పనులు స్పీడప్ చేయాలి : మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

ఉప్పల్​, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉప్పల్​లోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు.

రహదారులపై చెత్త పేరుకుపోకుండా చూడాలని, డ్రైనేజీ కాలువల్లో మట్టిని ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలను గుర్తించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, డీసీ రాజు, ఏసీపీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.