హైదరాబాద్, వెలుగు: ఓబెన్ ఎలక్ట్రిక్ ఉగాది ఆఫర్లను ప్రకటించింది. తమ ఈ–బైక్ రోర్ ఈజెడ్ సిగ్మా మోడల్ పై రూ.37 వేల వరకు ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపింది.
ఈ బండి ధర రూ.1.10 లక్షల నుంచి మొదలవుతుంది. కొనుగోలుదారులకు ఐదేళ్లు లేదా 60 వేల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తారు. ఏడాది పాటు ఓబెన్ కనెక్ట్ సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది.
