పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం: నెలకు రూ.10 వేలు అందేలా ఏర్పాట్లు

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్థిక సహాయం: నెలకు రూ.10 వేలు అందేలా ఏర్పాట్లు

పద్మారావునగర్, వెలుగు: వయోభారం, తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి పావలా శ్యామలకు సినీ హీరో అల్లు అర్జున్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం తిరుమలగిరిలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయంలో తన కుమార్తెతో కలిసి నివసిస్తున్న ఆమె పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్.. వారి వైద్యం, నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. 

గతంలో పలువురు ఆమెకు సహాయం చేసినప్పటికీ  అనారోగ్యం కారణంగా పరిస్థితి మరింత క్షీణించడంతో ప్రస్తుతం ఆమె ఆశ్రయంలో తలదాచుకుంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో స్పందించి సాయం అందించిన అల్లు అర్జున్​పై సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. పావలా శ్యామల లాంటి సీనియర్ నటులను ఆదుకునేందుకు మరికొంతమంది ముందుకు రావాలని కోరుతున్నారు.