- జర్నలిస్టు కాలనీ, కేబుల్ బ్రిడ్జి వైపు భారీగా జామ్ !
- ఎటు వెళ్లాలో తెలియక గందరగోళం
- జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు భారీగా ట్రాఫిక్ జామ్
- బాలకృష్ణ ఇంటికి ముందు బారికేడ్లతో సమస్య
- చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి
- ఫ్రీ లెఫ్టులు, రోడ్డు లెవెల్ పనులు చేయాలంటున్న వాహనదారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కు చుట్టూ అమలవుతున్న వన్‌వే లో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. పార్కు చుట్టూ అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు వస్తాయని అనుకున్నప్పటికీ వన్ వే తో ట్రాఫిక్సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే, తర్వాత వన్ వే కి అనుగుణంగా తీర్చిదిద్దకపోవడంతో కొన్నిచోట్ల వాహనదారులకు తీవ్రమైన సమస్య ఎదురవుతున్నది.
ఆ రెండు చోట్ల ట్రాఫిక్ జామ్స్
ఫిలింనగర్ నుంచి వచ్చే రోడ్డులో సిగ్నల్ వద్ద నుంచి జర్నలిస్టు కాలనీ, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. ముఖ్యంగా జర్నలిస్టు కాలనీకి ముందే ఏ రూట్లో వెళ్లాలో అర్థంకాక వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. చెక్ పోస్ట్ కు వెళ్లేవారు కుడి వైపు, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లేవారు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్లాల్సి ఉండగా..సరైన రూట్మ్యాప్లేక కన్ఫ్యూజ్అవుతున్నారు.
ఒకవేళ చెక్ పోస్ట్‌వైపు వెళ్లాలనుకునేవారు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే గనక అంబేద్కర్ఓపెన్యూనివర్సిటీ రోడ్డు వైపు వెళ్లి అక్కడ ఫ్లైఓవర్ కింద యూ టర్న్ తీసుకుని బాలకృష్ణ ఇంటి మీదుగా చెక్ పోస్టు వైపు వెళ్లాల్సి వస్తున్నది. ఇది లాంగ్జర్నీకి కారణమవుతున్నది. ఇక్కడ బారికేడ్లు తీసేసి వెహికల్స్డైరెక్ట్ వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్వినిపిస్తున్నది. అలాగే, జర్నలిస్ట్ కాలనీకి ముందే క్రాసింగ్ఇవ్వడంతో రైట్వెళ్లేవారు లెఫ్ట్..లెఫ్ట్ వెళ్లేవారు రైట్వెళ్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ జామ్..ఫిలింనగర్ నుంచి మొదలుకుంటే రోడ్డు నెంబర్ 92 ( అపోలో బస్టాప్) దాకా పడుతున్నది.
ఫిలింనగర్ సిగ్నల్ వద్ద స్పష్టమైన సూచిక బోర్డులు లేకపోవడం, వన్ వేపై కొంతమందిలో అవగాహన లేక చివరి నిమిషంలో రూట్ మార్చుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే, రద్దీ తీవ్రంగా ఉంటోంది. మరోవైపు కేబుల్ బ్రిడ్జి రూట్ నుంచి బాలకృష్ణ ఇంటి మీదుగా చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, కృష్ణానగర్ వైపు వెళ్లేవారు లెఫ్ట్ నుంచి, ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్లేవారు రైట్ నుంచి వెళ్లాలి.
బాలకృష్ణ ఇంటి దగ్గరే రైట్‌కు వెళ్తే ఈజీగా ఎన్టీఆర్భవన్వైపు వెళ్లిపోవచ్చు. కానీ, పొరపాటున లెఫ్ట్‌వైపు నుంచే వెళ్తే చిరంజీవి బ్లడ్‌బ్యాంకు దగ్గరకు వెళ్లి యూ టర్న్తీసుకోవాల్సి వస్తున్నది. అలాగే, బాలకృష్ణ ఇల్లు దాటాక ఇచ్చిన రైట్టర్న్వద్ద సడన్‌గా టర్న్ తీసుకుంటుండడంతో ట్రాఫిక్జామ్అవుతున్నది. అలాగే సాయంత్రం వేళల్లో అగ్రసేన్ జంక్షన్, కేబీఆర్ పార్కు మెయిన్ఎంట్రెన్స్ వద్ద కూడా వాహనాలు నిలిచిపోతున్నాయి.
రోడ్డు లెవెలింగ్ లేక..
కేబీఆర్‌పార్కు చుట్టూ ఉన్న రోడ్డుపై కొన్ని ప్రాంతాల్లో లెవెలింగ్సరిగ్గా లేకపోవడం కూడా వాహనాల రాకపోకలపై ప్రభావం చూపుతున్నది. ఇదివరకు ఉన్న రోడ్డులో ఒకవైపు ఎత్తు, మరోవైపు డౌన్ తో పాటు మధ్యలో డివైడర్ ఉఉంది. ఇప్పుడు వన్ వే చేయడంతో అక్కడక్కడ వాహనాలు అటు ఇటు మూవ్ అవుతుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముందుగా జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట్ల రోడ్డు లెవెలింగ్పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ముందుగానే మార్గాలు స్పష్టంగా తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్నారు.
