T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ పోరు ఇవాళ వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సూపర్–-8 దశలో వెస్టిండీస్ పై గెలిచి భారత్ ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ కూడా ప్రారంభంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చింది. కాగా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ కి వెళ్లాలని రెండు టీమ్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.
వాంఖెడే పిచ్ రిపోర్ట్:
వాంఖెడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పిచ్‌పై కొంత గడ్డి కనిపిస్తోంది. ఇది పిచ్‌లో తేమ నిల్వ ఉండేలా చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉంచినట్లు తెలుస్తుంది. వాంఖెడేలో ఉన్న ఎర్ర మట్టిపిచ్ కారణంగా తేమ త్వరగా ఆరిపోకుండా గడ్డి హెల్ప్ చేస్తుంది. అయితే మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయం లభించే ఛాన్స్ ఉంది. గడ్డి– ఎర్ర మట్టి పిచ్ లక్షణాలతో ఫాస్ట్ బౌలర్లకి బౌన్స్‌తో పాటు స్వింగ్, సీమ్ మూవ్‌మెంట్ ఉండనుంది. దీంతో పవర్‌ప్లేలో ఓపెనర్లకు స్పీడ్ బౌలర్లు సవాల్ విసిరే అవకాశం ఉంది.
మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీ రోల్:
మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ కాస్త స్థిరపడే అవకాశం కనిపిస్తుంది. పిచ్ పై ఉన్న గడ్డి కొంచెం రఫ్ అయితే స్పిన్నర్లకు కూడా టర్న్ దొరికే ఛాన్స్ ఉంటుంది. దీంతో మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్ కీలకంగా మారవచ్చు.
►ALSO READ | T20 World Cup: భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్.. ఈ మూడు రికార్డులు బ్రేక్ కావాల్సిందే!
భారీ స్కోర్లు సాధ్యమే:
అయితే మొత్తంగా చూస్తే వాంఖెడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో 200+ కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ (తేమ) కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంది.
మోర్నే మోర్కెల్ ఆందోళన:
డ్యూ (మంచు) ప్రభావంపై భారత్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూ ఎప్పుడూ పెద్ద సమస్యే.. అది మన నియంత్రణలో ఉండదు అన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది.. వాంఖెడేలో ఎక్స్ ట్రా బౌన్స్ ఉంటుందని చెప్పాడు. బ్యాటర్లు ఆ బౌన్స్‌ను నమ్ముకుని స్ట్రోక్స్ ఆడుతారు.. ఆ సమయంలో బౌలర్లకు కూడా ఛాన్సులు వస్తాయని తెలిపారు. కానీ ఈ గ్రౌండ్ చిన్నదిగా ఉండటంతో, బంతి వేగంగా బౌండరీ దాటుతుందని వెల్లడించాడు. అందుకే ప్రతి ఓవర్‌లో ఆచుతూచీ ఆడాలి.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ కాకుండా బిగ్ షాట్స్ ఆడటం వలన కూడా బౌలర్లకు వికెట్లు పడే అవకాశాలు ఉన్నాయని మోర్నే మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
