T20 World Cup: భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్.. ఈ మూడు రికార్డులు బ్రేక్ కావాల్సిందే!

T20 World Cup: భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్.. ఈ మూడు రికార్డులు బ్రేక్ కావాల్సిందే!

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇవాళ (మార్చి 5న) హైవోల్టెజ్ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ -ఇంగ్లాండ్ టీమ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. కాగా రెండు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ పోరు తప్పదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్ లో వరుసగా మూడో సారి ఎదురెదురుపడుతున్నాయి. 2022 ఎడిషన్లో ఇంగ్లాండ్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఇక 2024 ఎడిషన్ లో ఇంగ్లండ్ ని 68 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడించి, ట్రోఫిని సొంతం చేసుకుంది. అయితే గత రెండు ఈవెంట్లలో రెండు టీమ్స్ మధ్య జరిగిన సెమీఫైనల్స్ గెలిచిన జట్లు ఆతర్వాత కప్ కూడా గెలుస్తుండటంతో, ఇవాళ్టి మ్యాచ్ పై ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇక గెలుపోటముల గురించి పక్కన పెడితే, ఈరోజు  జరిగే మ్యాచ్ లో 3 భారీ రికార్డులు బ్రేయ్ అయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. 

ఆల్ టైమ్ టీమ్ టోటల్: 
ఈరోజు జరిగే మ్యాచ్ లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో అత్యధిక టీమ్ టోటల్ ని నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. 2016 ఎడిషన్ లో వాంఖడే స్టేడియంలోనే వెస్టిండీస్ పై చేసిన 192 పరుగులే ఇప్పటి వరకు అత్యధికంగా కొనసాగుతుంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ లో పటిష్టంగా ఉండటంతో.. ఇవాళ్టి మ్యాచ్ లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనోస్తుంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టీమిండియా 200+ పరుగులు చేస్తుందని అంచనా ఉంది.

విరాట్ రికార్డుకి ముప్పు: 
ఇవాళ్టి మ్యాచ్ లో బద్దలయ్యే ఛాన్స్ ఉన్న మరో రికార్డు టీ20 వరల్డ్ కప్ నాకౌట్ లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు.. ప్రస్తుతం ఈ రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరు మీద ఉంది. 2016 సీజన్ సెమీస్ లో కరేబియన్ జట్టుపై విరాట్ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్, నాటౌట్) ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ నాకౌట్ లో మెన్ ఇన్ బ్లూ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా కొనసాగుతుంది. ఈ రికార్డు కూడా ఈరోజు బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాల నుంచి ఈ రికార్డుకు ప్రమాదం పొంచి ఉంది. 

ఏ జట్టు గెలిచినా రికార్డే: 
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్ కి  చేరిన రికార్డు ఈరోజు బద్దలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్ ఫైట్ కి చేరాయి. ఇవాళ్టి మ్యాచ్ లో  ఏ టీమ్ గెలిచినా చరిత్ర తిరగరాసినట్లు అవుతుంది. భారత్ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్ కి రాగా, ఇంగ్లాండ్ 2010, 2016, 2022 సీజన్లలో తుది పోరుకు అర్హత సాధించింది.