మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ధర్మారం చెరువులో చేపల వలలో ఓ మొసలి చిక్కింది. బుధవారం గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపలు పడుతుండగా, మొసలి చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. వలను ఒడ్డుకు తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. లక్సెట్టిపేట ఎఫ్ఆర్వో, డిప్యూటీ ఎఫ్ఆర్వో సునీత, ఎఫ్బీవో ఫరీదా వెంటనే అక్కడికి చేరుకున్నారు. మొసలిని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో వదిలిపెట్టారు.
