ఒమన్లో ఆయిల్ ట్యాంకర్పై దాడి.. ఇద్దరు ఇండియన్లు మృతి

ఒమన్లో ఆయిల్ ట్యాంకర్పై దాడి.. ఇద్దరు ఇండియన్లు మృతి
  • నౌకలో 15 మంది భారతీయలు

న్యూఢిల్లీ: ఇరాన్‌‌, అమెరికా–ఇజ్రాయెల్‌‌ మధ్య యుద్ధంలో ఒమన్‌‌లోని స్కైలైట్‌‌ అనే ఆయిల్ ట్యాంకర్‌‌‌‌పై జరిగిన దాడిలో ఇద్దరు ఇండియన్లు మృతి చెందారు. మృతులను బిహార్‌‌‌‌కు చెందిన కెప్టెన్‌‌ ఆశిష్‌‌ కుమార్‌‌‌‌, మహారాష్ట్ర ముంబైకి చెందిన దీక్షిత్‌‌ సోలంకిగా గుర్తించారు. ఇదే నౌకలో పనిచేస్తున్న రాజస్తాన్‌‌కు చెందిన దలీప్‌‌ సింగ్‌‌ అనే మరో వ్యక్తి గల్లంతయినట్లు సమాచారం. 

పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ స్కైలైట్‌‌ ఆయిల్‌‌ ట్యాంకర్‌‌‌‌పై ఒమన్‌‌లోని ముసందమ్‌‌ ఐల్యాండ్‌‌ సమీపంలో ఖసాబ్‌‌ పోర్ట్‌‌కు ఉత్తరాన 5 నాటికల్‌‌ మైళ్ల దూరంలో దాడి జరిగింది. ఈ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 15 మంది భారతీయులు కాగా, మరో ఐదుగురు ఇరానీయున్లు ఉన్నారు. 

దాడి జరిగిన తర్వాత అందులోని సిబ్బందిని ఒమన్‌‌ మెరైన్‌‌ సెక్యూరిటీ సెంటర్‌‌‌‌ (ఎంఎస్‌‌సీ) అధికారులు ఖాళీ చేయించారు. అయితే, షిప్‌‌ను ఏ ఆయుధంతో దాడి చేశారనే విషయాన్ని వారు చెప్పలేదు. నౌకలో రెండు డెడ్‌‌బాడీలను వెలికితీశారు.