హనీ ట్రాప్.. విదేశీ గూఢఛారులు చేసే పనులను ఇప్పుడు జిల్లా కేంద్రాలకు పాకింది. కొంత మంది కేటుగాళ్లు.. డబ్బున్నోళ్లను.. వ్యాపారులను హనీ ట్రాప్ చేసి బెదిరిస్తున్న ఘటనలు తరచుగా ఉంటూనే ఉంటాం. ఇప్పుడు అది జిల్లా కేంద్రాలకు పాకింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన హనీట్రాప్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారింది.
జగిత్యాల జిల్లాకు చెందిన రాజు, శేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు.. మెట్ పల్లి ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని హనీట్రాప్ గా ఉపయోగించారు. ఇప్పుడు ఈ విషయం జిల్లాలో కలకలం రేపుతోంది. జగిత్యాల, మెట్ పల్లి ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంత మంది ప్రముఖులకు చెందిన పర్సనల్ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఓ అమ్మాయిని ఎరగా వేసి.. వాళ్లు ఏకాంతంగా ఉన్నప్పుడు.. ఈ రాజు, శేఖర్ ఫొటోలు, వీడియోలు తీసి.. ఆ తర్వాత వాళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే రాజు, శేఖర్ తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి వాళ్లను విచారిస్తున్నారు.
రాజు, శేఖర్ హనీట్రాప్ ద్వారా.. అమ్మాయి వలలో చిక్కిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఫొటోలు, వీడియోలు చూపించి.. బ్లాక్ మెయిల్ చేయటం.. డబ్బులు డిమాండ్ చేయటంతో.. బాధిత రియల్టర్ పోలీసులను ఆశ్రయించటంతో.. మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.
రాజు ఫోన్ చెక్ చేయగా.. అందులో జగిత్యాల, మెట్ పల్లి ఏరియాలకు చెందిన చాలా మంది వ్యాపార, రాజకీయ ప్రముఖుల ఫొటోలు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ కొనసాగుతుంది అని మాత్రమే చెబుతున్నారు. ఎరగా వేసిన అమ్మాయిది కూడా మెట్ పల్లి ప్రాంతం అని చెబుతున్నారు. నిందితులు రాజు, శేఖర్.. ఓ రాజకీయ పార్టీ ముఖ్యనేత అనుచరులుగా చెప్పుకుంటున్నారు జనం. విచారణ తర్వాత అన్ని విషయాలపై ప్రెస్ మీట్ పెడతాం అని చెబుతున్నారు పోలీసులు.
