తెలంగాణ రాష్ట్రంలో 2025 ఇయర్లో కేసుల వివరాలను వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి. డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికను రిలీజ్ చేస్తూ.. రాష్ట్రంలో క్రైం రేటు ఎలా ఉంది.. ఏ నేరాలు పెరిగాయి.. ఏ నేరాలు తగ్గాయి అనే రిపోర్ట్ వెల్లడించారు.
- తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయి.
- 2025లో 173 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం పట్టుబడ్డాయి.
- ఇక సెల్ ఫోన్ చోరీలు భారీగా జరగ్గా.. అందుకు తగ్గట్టుగానే రికవరీల్లో తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ లో నిలిచింది. 2025లోనే ఏకంగా ఒక లక్షా 20 వేల సెల్ ఫోన్లను రికవరీ చేసి.. బాధితులకు అందించారు పోలీసులు.
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ 3 శాతం తగ్గింది. ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనం
- 2024 సంవత్సరంతో పోల్చుకుంటే.. 2025లో మొత్తం నేరాలు 2.3 శాతం తగ్గాయి.
- తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 5.68 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఆయా ప్రమాదాల్లో మరణాలు 8 శాతం తగ్గాయి. ఫస్ట్ ఎయిడ్ అవగాహనతో మృతుల సంఖ్య తగ్గుదల అని ప్రకటించారు పోలీసులు.
- తెలంగాణ రాష్ట్రంలో హత్యలు 8.76 శాతం తగ్గాయి
- ఇక అత్యాచారాలు కూడా 13.45 శాతం తగ్గాయి
- రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు 27 శాతం తగ్గితే.. ఇదే సమయంలో దొంగతనాలు 9.1 శాతం తగ్గాయి.
- మరో షాకింగ్ ఏంటంటే.. దోపిడీలు, దొంగతనాలు తగ్గినా.. నమ్మకద్రోహం కేసులు ఏకంగా 23 శాతం పెరిగాయి.
- రాష్ట్రంలో వరకట్నం కోసం మహిళల హత్యలు గణనీయంగా తగ్గాయి. వరకట్న వేధింపుల కేసులు కూడా 2 శాతం తగ్గాయి. షీ టీమ్‌లు అత్యంత యాక్టివ్‌గా చేయటం వల్ల ఇది సాధ్యమైందని వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి.
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గాయి.
- ఫింగర్ ప్రింట్ నిపుణుల సాయంతో 642 కేసులు ఛేదించినట్లు పోలీస్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
- తెలంగాణలో 2024 ఏడాదితో పోల్చితే.. డ్రగ్స్ కేసులు 30 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిందితులను గల్ టీమ్ పట్టుకొస్తుంది. ఈ ఏడాది ఈగల్ టీమ్ ద్వారా 173 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
- IPC సెక్షన్ల కింద కేసులు 7.83 శాతం పెరగ్గా.. మహిళలపై దాడుల కేసులు 2.90 శాతం పెరిగాయి.
- తెలంగాణలో 2025లో.. 248 మంది మహిళలు హత్యకు గురవ్వగా.. రేప్ కేసులు 13 శాతం తగ్గాయి
- కిడ్నాప్ కేసులు 10 తగ్గగా.. వేధింపుల కేసులు కూడా 9 శాతం తగ్గాయి
- తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది23 శాతం రికవరీ చేయగా.. దీని విలువ రూ.246 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం 25 వేల 500 మంది బాధితులకు రూ.159 కోట్లు రీఫండ్ చేశారు పోలీసులు.
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025 వివరాలు డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని.. పోలీస్ సిబ్బంది రాత్రి పగలు పని చేస్తున్నారని.. సిబ్బంది అభినందనలు తెలిపారు డీజీపీ. 2025లోనే.. 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. లోక్ అదాల త్‌లలో భారీగా కేసుల పరిష్కారం జరిగిందని స్పష్టం చేశారు డీజీపీ.
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక పదవుల్లో మహిళా అధికారుల నియామకంతోపాటు.. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం జరిగిందని వెల్లడించారాయన. ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ వ్యవస్థ అమలు చేయటం ద్వారా.. ఫిర్యాదుదారుల నుంచి సేవలపై ఫీడ్‌బ్యాక్ సేకరణ జరిగిందన్నారు.
సెప్టెంబర్‌లో ప్రారంభం అయిన తెలంగాణ టూరిస్ట్ పోలీస్ విభాగంలో ప్రస్తుతం ప్రస్తుతం 80 మంది టూరిస్ట్ పోలీస్ సిబ్బంది ఉన్నారని.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇక పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులకు అవార్డు రావటం మంచి పరిణామం అన్న డీజీపీ.. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ దేశంలోనే 7వ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తింపు రావటం శుభపరిణామం అని.. పోలీస్ శాఖ పనితీరుకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి.
