రమణీయం.. కీసర రామలింగేశ్వర కల్యాణం : మంత్రి శ్రీధర్ బాబు

రమణీయం.. కీసర రామలింగేశ్వర కల్యాణం : మంత్రి శ్రీధర్ బాబు
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

కీసర, వెలుగు: కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం శ్రీభవానీ శివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం రుద్రాభిషేక హోమం, సాయంత్రం బిల్వార్చన కార్యక్రమాల అనంతరం రాత్రి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కల్యాణం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్​చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ మను చౌదరి ప్రభుత్వ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.