మీట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చెయ్యాలి

మీట్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చెయ్యాలి

ఓల్డ్​సిటీ, వెలుగు: సిటీలో మీట్ కంట్రోల్ బోర్డును ఏర్పాటు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మీట్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ హబీబ్ ఖురేషి డిమాండ్ చేశారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనను శనివారం ఉర్దూ భవన్​లో ఎంఐఎం నాయకులు సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో వందల కోట్ల వ్యాపారం జరుగుతున్నా నియంత్రణ బోర్డు లేకపోవడం వల్ల దళారులకే లాభం చేకూరుతుందన్నారు. గౌలిపుర మండిని తెరిపించాలని, జియగూడ మండి అభివృద్ధి పనులను పునఃప్రారంభించాలని కోరారు.