సీఎంఏ ఫలితాల్లో ‘మాస్టర్ మైండ్స్’ ప్రభంజనం

సీఎంఏ ఫలితాల్లో  ‘మాస్టర్ మైండ్స్’ ప్రభంజనం
  •     ఆల్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సొంతం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) విడుదల చేసిన కాస్ట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌‌‌‌‌ (సీఎంఏ) ఫలితాల్లో ‘మాస్టర్ మైండ్స్’ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అఖిల భారత స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో 25 ర్యాంకులను సాధించారు. వివరాలను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్  వెల్లడించారు. సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా టాప్ 50 ర్యాంకుల్లో 16, 17, 30, 31, 40వ ర్యాంకులను మాస్టర్ మైండ్స్ విద్యార్థులు దక్కించుకున్నారు. 

వీటితోపాటు మొత్తం 20 ర్యాంకులను సాధించారు.  5, 13, 21, 22, 25, 27, 28, 32, 35, 37 (ఇద్దరు), 39, 41, 42, 46, 47 (ఇద్దరు), 48, 49 (ఇద్దరు) ర్యాంకులతో సత్తాచాటారు. గుంటూరు ఎగ్జామ్ సెంటర్ నుంచే 23 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు రావడం విశేషం. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ ప్రతినిధులు మట్టుపల్లి శివప్రసాద్, సిబ్బంది అభినందించారు.