న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడేళ్లు అవుతున్న సందర్భంగా ఆ దాడిలో మరణించిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు శనివారం నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి14న జమ్మూకశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై టెర్రరిస్టులు జరిపిన బాంబుదాడిలో భీకర దాడి 40 మంది జవాన్లు మరణించారు.
సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని మోదీ అన్నారు. పుల్వామా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. టెర్రిజంపై ఇండియా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. పుల్వామా అమర జవాన్లు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
