వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు హర్షించరని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ అర్ధ సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ సొంత బలంతోనే గెలిచారని, అందులో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాత్ర ఏమీ లేదన్నారు. ఒక దళితుడు స్పీకర్ స్థానంలో ఉంటే హర్షించాల్సింది పోయి విమర్శించడం తగదని హితవు పలికారు.
