బంగారం వెండి ప్రియులకు కునుకులేకుండా చేస్తున్న భారీ ర్యాలీకి బ్రేక్ పడింది. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు ధరల పతనం షాపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా పీస్ డీల్ వైపు అడుగులు, లాభాల స్వీకరణ, ఇతర అంతర్జాతీయ కారణాలతో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పతనం అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా తమ ప్రాంతంలో తగ్గిన రేట్లను గమనించండి.
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 30, 2025న బంగారం రేట్లు తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.305 తగ్గింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 620గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 485గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో సీఎన్ చానెల్
ఇక వెండి కూడా భారీ ర్యాలీ తర్వాత ఎట్టకేలకు తగ్గుదలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా డిమాండ్ కి తగిన స్థాయిలో సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ ఆగకుండా కొనసాగటానికి కారణమైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం డిసెంబర్ 30, 2025న వెండి రేటు కేజీకి రూ.18వేలు తగ్గుదలను నమోదు చేసి కొనుగోలుదారులకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 58వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.258 వద్ద ఉంది.
