ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో సీఎన్ చానెల్

ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో సీఎన్ చానెల్

హైదరాబాద్​, వెలుగు: భారతీ ఎయిర్​టెల్ తన డిజిటల్ టీవీలో ఎయిర్​టెల్ కార్టూన్ నెట్​వర్క్ క్లాసిక్స్ చానెన్‌‌ను ప్రారంభించింది. ఇందులో టామ్ అండ్ జెర్రీ, ఫ్లింట్ స్టోన్స్, లూనీ ట్యూన్స్ వంటి పాత కార్టూన్లు ప్రసారం అవుతాయి. దీని ధర నెలకు రూ.59 కాగా, 445 నంబర్ ఛానెల్ లో అందుబాటులో ఉంటుంది. ఎక్స్​స్ట్రీమ్, ఐపీటీవీ వినియోగదారులు కూడా దీనిని చూడవచ్చని ఎయిర్​టెల్​ తెలిపింది.