న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుండి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ గూడ్స్ వాహనాలు, భారీ ప్యాసింజర్ వాహనాలు హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపారు పోలీసులు. ఏపీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఈ వాహనాలు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో వెళ్లాలని సూచించారు పోలీసులు.

ట్యాంక్ బండ్ దగ్గరికి కాలినడకన వెళ్లాలనుకునేవారు ఇక్కడ పార్కింగ్ చేయాలి:

  • సచివాలయం విజిటర్స్ పార్కింగ్ స్థలం
  • ప్రసాద్స్ మల్టీప్లెక్స్ పక్కన HMDA పార్కింగ్ గ్రౌండ్
  • GHMC హెడ్ ఆఫీస్ లేన్
  • రేస్ కోర్స్ రోడ్ (ఎన్టీఆర్ ఘాట్ పక్కన)
  • ఆదర్శ్ నగర్ లేన్ ( టూ వీలర్స్ మాత్రమే)
  • ఎన్టీఆర్ స్టేడియం

త్రీస్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్ళు, క్లబ్బులు, బార్లు, పబ్బులు, ఈవెంట్ ఆర్గనైజర్లు ట్రాఫిక్‌ను నియంత్రించడానికి సజావుగా ప్రవేశించడానికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతను కల్పించాలని ఆదేశించారు పోలీసులు.

అదనంగా, హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ కోసం అవసరాన్ని బట్టి మళ్లింపులు డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు:

  • రాజ్ భవన్ వైపు నుండి వచ్చే, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను షాదన్ కళాశాల వైపు మళ్లిస్తారు.
  • పాత అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
  • ఇక్బాల్ మినార్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ వైపు వెళ్లే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
  • ఖైరతాబాద్ మార్కెట్ నుండి వచ్చే, నెక్లెస్ రోటరీ సెన్సేషన్ థియేటర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రాజ్‌దూత్ లేన్ మరియు లక్డికాపూల్ వైపు మళ్లిస్తారు.
  • ఇక్బాల్ మినార్ నుండి వచ్చే, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పాత అంబేద్కర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.
  • ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ జంక్షన్ నుండి వచ్చే, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు.
  • మినిస్టర్ రోడ్ నుండి వచ్చే, PVNR మార్గ్ వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
  • బుద్ధ భవన్ నుండి వచ్చే, PVNR మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్ వైపు మళ్లిస్తారు.
  • దోభి ఘాట్ నుండి వచ్చే, చిల్డ్రన్స్ పార్క్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కవాడిగూడ ఎక్స్ రోడ్ల వైపు మళ్లిస్తారు.
  • డీబీఆర్ మిల్స్, సీజీఓ టవర్స్ నుంచి సెయిలింగ్ క్లబ్ వైపు వెళ్లే వాహనాలను జబ్బార్ కాంప్లెక్స్, సీజీఓ టవర్స్ వైపు మళ్లిస్తారు.
  • కర్బలా మైదాన్ నుండి వచ్చే, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కవాడిగూడ ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
  • నగరం అంతటా 217 ముఖ్యమైన, రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లు కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించామని, డ్రంక్ అండ్ డ్రైవ్ నడపడం, ఇతర నేరాలను నివారించడానికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.