హైవే నుంచి సర్వీస్ రోడ్డుపైకి ఎగిరపడ్డ కారు.. ఆదిలాబాద్ జిల్లాలో కారు, బస్సును ఢీకొట్టిన లారీ

హైవే నుంచి సర్వీస్ రోడ్డుపైకి ఎగిరపడ్డ కారు.. ఆదిలాబాద్ జిల్లాలో కారు, బస్సును ఢీకొట్టిన లారీ

ఆదిలాబాద్ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి కారును, బస్సును ఢీకొట్టి.. జనావాసాల్లోకి దూసుకుపోయింది. 2025, ఫిబ్రవరి 28 తేదీన..  ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. 

హైవేపై లారీ అదుపుతప్పి అడ్డొచ్చిన వాహనాలను ఢీకొడుతూ భీభత్సం సృష్టించింది. వరుసగా ఎర్టిగా కారును, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది . లారీ ఢీ కొట్టడంతో ఎర్టీగా కారు హైవే పై నుంచి పల్టీ కొట్టి సర్వీస్ రోడ్డుపై పడింది. దీంతో ఎర్టీగా వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యారు. గాయపడ్డ  వారిని రిమ్స్ ఆసుపత్రికు తరలించారు.  

లారీ ఢీకొట్టడంతో కారు బోల్తా పడగా.. బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు బస్సులోని ప్రయాణికులు. అదుపుతప్పిన లారీ సర్వీస్ రోడ్డు దాటి జనావాసాల్లో దూసుకెళ్లి ఓ ఇంటిని ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో సర్వీస్ రోడ్డుపై వాహనాలు లేకపోవడం, జనావాసాల్లో ఎవరు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.