హైదరాబాద్ దుర్గం చెరువు ఆక్రమించి.. నెలకు రూ.50 లక్షల పార్కింగ్ దందా.. యాక్షన్ తీసుకున్న హైడ్రా

హైదరాబాద్ దుర్గం చెరువు ఆక్రమించి.. నెలకు రూ.50 లక్షల పార్కింగ్ దందా..  యాక్షన్ తీసుకున్న హైడ్రా

హైదరాబాద్ దుర్గం చెరువు ఏరియా ఎంత ఖరీదైనదో చెప్పనవసరం లేదు. హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్.. ఇలా అత్యంత కాస్ట్లీ ఏరియాలో కబ్జా కోరులు భలే ప్లాన్ చేశారు. కోట్ల విలువైన స్థలం ఆక్రమించి వ్యాపారాలు పెట్టుకుని రోజుకు లక్షల్లో వసూలు చేస్తున్నారు. దుర్గం చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్ లోకి దిగింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చర్యలకు ఆదేశించడంతో మంగళవారం (డిసెంబర్ 30) ఆక్రమణలు తొలగించింది హైడ్రా.

దుర్గం చెరువు ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి తొలగింపు చర్యలు చేపట్టిన హైడ్రా.. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల మేర ఆక్రమణల తొలగించింది హైడ్ర్ఆ. చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో నెలకు సుమారు రూ.50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు తేలింది. వాహనాలను ఖాళీ చేయించి ఆక్రమిత ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా అధికారులు.

Also Read :సంక్రాంతికి ఊళ్లకు వెల్లెటోళ్లకు టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వండి

ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఆక్రమణల కారణంగా  ప్రస్తుతం 116 ఎకరాలకు కుదింపుకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. NRSC శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి నింపి భూమి కబ్జా చేసినట్లు తేల్చారు. కొండలు తవ్విన మట్టిని చెరువులో డంపింగ్ చేసి  స్కూల్ బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలకు అక్రమ పార్కింగ్ నిర్వహిస్తున్నారు.

భూమి రికార్డులు లేకుండానే పార్కింగ్ వ్యాపారం చేయడంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేయటంతో పాటు.. వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అడ్డుగా మారిన ఆక్రమణలను తొలగించింది హైడ్రా.