టీ20ల్లో భూటాన్ బౌలర్ వరల్డ్ రికార్డ్.. ఒక్కడే 8 వికెట్లు తీశాడు

టీ20ల్లో భూటాన్ బౌలర్ వరల్డ్ రికార్డ్.. ఒక్కడే 8 వికెట్లు తీశాడు

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మరో వరల్డ్ రికార్డు బ్రేక్ అయింది. భూటాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన యంగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ సోనమ్ యెషే (4–1–7–8)  ఒకే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు సృష్టించాడు. ఈ నెల 26న మయన్మార్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అతను ఈ ఘనత సాధించాడు. 22 ఏండ్ల  లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన సోనమ్ తన కోటా 4 ఓవర్లలో 7 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.

టీ20ల్లో ఏ స్థాయిలోనైనా ఒక బౌలర్ 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. గతంలో మలేసియా పేసర్ స్యాజ్రుల్ ఇద్రుస్ 2023లో చైనాపై  8 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీయడమే ఇప్పటిదాకా ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌. ఇప్పుడు ఆ రికార్డును సోనమ్ బ్రేక్ చేశాడు. అతని ధాటికి భూటాన్ ఇచ్చిన 128 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో మయన్మార్ 45కే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది.