హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి

హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి

రాజ్‌‌‌‌కోట్‌‌‌‌: బ్యాటర్లు రాణించి భారీ స్కోరు చేసినా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌ వరుసగా మూడో ఓటమిని ఎదుర్కొంది. సోమవారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి పోరులో అస్సాం 4 వికెట్ల తేడాతో హైదరాబాద్‌‌‌‌పై గెలిచింది. తొలుత రాహుల్ సింగ్ (79), అభిరత్ రెడ్డి (54), నితేష్ రెడ్డి (53) హాఫ్​సెంచరీలతో రాణించడంతో హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 310/8 స్కోరు చేసింది. 

అస్సాం బౌలర్లలో అబ్దుల్ అజీజ్‌‌‌‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో అస్సాం 49.3 ఓవర్లలో 314/6 స్కోరు చేసి గెలిచింది. ఆ టీమ్ ప్లేయర్ శివ్ శంకర్ రాయ్ (112) సెంచరీతో సత్తా చాటాడు. కెప్టెన్‌‌‌‌ సీవీ మిలింద్ మూడు వికెట్లు తీసినా మిగతా బౌలర్లు ఫెయిలయ్యారు. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో బరోడాతో హైదరాబాద్ పోటీపడనుంది.